బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేళ్లు
బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేళ్లు సావాసం చేశానంటోంది నటి నీతూచంద్ర. కోలీవుడ్‌లో యావరుం నలమ్, తీరాద విలైయాట్టు పిల్లై, ఆదిభగవాన్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీపై పలు వదంతులు ప్రచారంలో వున్నాయి. వీటిపై నీతూచంద్రా స్పందిస్తూ తాను తీహార్ భామనని అంది. మాతృభాష భోజ్‌పురి అని చెప్పింది. భోజ్‌పురి భాషా చిత్రాలు అశ్లీలం అనేఅపవాదును తొలగించాలనే తలంపుతో తానే సొంతంగా దేశ్వ అనే చిత్రాన్ని నిర్మించానని తెలిపింది.
ఆ చిత్రం 8 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైనట్లు వివరించింది. అసలు ఇండియన్ మనోరమ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన తొలి భోజ్‌పురి చిత్రం ఇదేనని పేర్కొంది. తనపై వదంతుల గురించి అడుగుతున్నారని అలాంటివి తాను ఇష్టపడనని అంది. తన భాయ్‌ఫ్రెండ్‌తో ఐదే ళ్లు సావాసం చేశానని, తమ గురించే అలాంటి వదంతులు ప్రచారం అవుతున్నాయని తెలుసని చెప్పింది. తన వరకు ఒక పని అనుకుంటే అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ అవుతానని అంది. ఈ బ్యూటీ బాయ్‌ఫ్రెండ్ అని చెబుతున్న బాలీవుడ్ నటుడు రణదీప్‌హుడాతో మనస్పర్థల కారణంగా విడిపోయిందన్నమాట.