తమిళసినిమా: ఆరిలిరుందు ఆరువరై చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. రోషన్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత రిషిరాజ్ సమర్పణలో ఆర్‌ఎస్‌ఎస్.ప్రొడక్షన్స్ రోహన్ సలియన్ నిర్మించిన చిత్రం ఆరిలిరుందు ఆరువరై. కొత్త నటుడు కరాటే కౌశిక్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కుష్భూసింగ్ అనే నవ నటి కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా శ్రీహరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జీవా వర్షిణి సంగీతాన్ని అందిస్తున్న ఈ యూత్‌ఫుల్ లవ్ కథా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. పూర్య నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత కలపులి ఎస్.థాను తొలి సీడీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ఆరి, కృష్ణ, యువన్, అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవిధ్యభరిత కథాంశాలతో కూడిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, అదే వరుసలో ఈ ఆరిలిరుందు ఆరువర చిత్రం నిలుస్తుందని భావిస్తున్నానని కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment