అఖిల్ ఆటా పాటా.. | Akhil movie song on the Eve of Vinayaka Chavithi | Sakshi
Sakshi News home page

అఖిల్ ఆటా పాటా..

Published Thu, Sep 17 2015 5:58 PM | Last Updated on Sun, Sep 3 2017 9:34 AM

అఖిల్ ఆటా పాటా..

అఖిల్ ఆటా పాటా..

అక్కినేని నట వారసుడు అఖిల్ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అఖిల్' విడుదలకు ముందే ప్రేక్షకుల్లో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ పాటను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసినట్లు అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమాకి సంబంధించి మరో పోస్టర్ని కూడా అఖిల్ పోస్ట్ చేశారు. 'హే గయ్స్.. స్మాల్ సర్ప్రైజ్' అంటూ ముందే ఊరించిన అఖిల్ మధ్యాహ్నం పాట వీడియో లింక్ను ట్వీట్ చేశారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు.

అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. ఆర్గానిక్ విగ్రహాలనే వాడాలని సూచించారు. కాగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్  రూపొందిస్తున్న ఈ సినిమా ఆడియోను అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఎస్ఎస్ థమన్, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement