దర్శకుల సంఘం అధ్యక్షునిగా వీరశంకర్ | Directors' association president virasankar | Sakshi
Sakshi News home page

దర్శకుల సంఘం అధ్యక్షునిగా వీరశంకర్

Published Mon, Mar 10 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

దర్శకుల సంఘం అధ్యక్షునిగా వీరశంకర్

దర్శకుల సంఘం అధ్యక్షునిగా వీరశంకర్

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. సంఘం అధ్యక్షునిగా వీరశంకర్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా కాశీవిశ్వనాథ్, చంద్రమహేశ్, ప్రధాన కార్యదర్శిగా మద్దినేని రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాయివెంకట్, కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాలాజీ, మధుర శ్రీధర్, కోశాధికారిగా కాదంబరి కిరణ్ గెలుపొందారు. మొత్తం 860 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. అంతేకాదు మొదటిసారిగా ఓ దర్శకురాలు ప్రియదర్శిని ఈసీ మెంబర్‌గా పోటీచేసి ఘన విజయం సాధించారు.  కార్యనిర్వాహక సభ్యులుగా  కె.రంగారావు, కోటేశ్వరరావు, అనిల్, సి.హెచ్. లక్ష్మణ్, చెవిపోగు శ్రీనివాస్, అజయ్,  పప్పు, సి. గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement