'ఆ విషయాల్లో సంచలనం మంచిదికాదు'
కోల్కతా: దేశంలో ఎవరిపని వారు చేసుకుంటున్నా ప్రతి రోజూ ఏదో ఒక చోట అశాంతి, అసహనం పెరిగిపోతుందని బాలీవుడ్ స్టార్ రణ దీప్ హుడా అన్నాడు. అయితే, ఇలాంటి విషయాల్లో జాగ్రతతో వ్యహరించాలని, వాటిని రాజకీయంగా, సంచలనంగా మార్చవద్దని సూచించాడు. అలా చేస్తే సమస్య మరింత పెద్దదవుతుందని తన అభిప్రాయం అన్నారు.
'ఎప్పుడూ ఏదో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సమాచారం అందించే విషయంలో మీడియా చాలా ముందుంది. కొందరు దీనిని తమ మైలేజ్ కోసం వాడుకోవాలని చూస్తుండటం దురదృష్టకరం. మీడియా కూడా సంచలనం చేస్తోంది. ఇలాంటి విషయాలు సంచలనాలుగా మార్చే అంశాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా ఇలాంటి ఘటనలు మరింత రెట్టింపు అవుతాయి. ఇలాంటి విషయాలతో రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి చేస్తాయని నేను అనుకోను' అని రణ దీప్ పేర్కొన్నాడు.