ఆ హీరోల సినిమాలో...దుల్కర్? | Dulquer Salmaan again teams up with Mani Ratnam | Sakshi
Sakshi News home page

ఆ హీరోల సినిమాలో...దుల్కర్?

Published Thu, Jul 16 2015 1:34 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ఆ హీరోల సినిమాలో...దుల్కర్? - Sakshi

ఆ హీరోల సినిమాలో...దుల్కర్?

చెన్నై:  ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత మణిరత్నంతో మరోసారి కలిసి పని చేసేందుకు తమిళ హీరో దుల్కర్ సల్మాన్ సిద్ధం అవుతున్నాడట. మణిరత్నం దర్శకత్వంలో రానున్న కొత్త ప్రాజెక్ట్లో దుల్కర్ నటించనున్నాడు. ఇంకా పేరును ఖరారు చేయని ఈ సినిమాలో హీరో కార్తీ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా  షూటింగ్  సెప్టెంబర్లో మొదలు కానుంది.

అలాగే 'కోమలి'  అనే పేరుతో  టైటిల్ను కూడా నిర్మాతలు  రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. కానీ మణి దర్శకత్వం వహించే సినిమాకే ఈ టైటిల్ రిజిస్ట్రర్ చేయించారా లేదా వేరే సినిమాకా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మణిరత్నం సినిమాలకు రెగ్యులర్గా సంగీతాన్ని అందించే  ఎఆర్ రెహ్మానే  ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తారా అనేదానితో పాటు... ఇతర నటీనటుల వివరాలను ఇంకా వెల్లడి చేయాల్సి ఉంది.

కాగా గతంలో ఈ సినిమాను  తెలుగు హీరోలు మహేష్ బాబు, నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కించాలని అనుకున్నారట మణిరత్నం. వీరిద్దరి కలయికలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి  తెరకెక్కించాలని ప్లాన్ చేశారని సమాచారం.  అయితే సల్మాన్ తో మణిరత్నం సినిమా నిర్మిస్తున్నారనే సమాచారంతో మహేష్,  నాగ్ల కాంబినేషన్లో అనుకున్న సినిమాను... దుల్కర్ సల్మాన్ ఎగరేసుకుపోయాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన  రొమాంటిక్  మూవీ ఓ కాదల్ కణ్మణి ( తెలుగులో ఓకే బంగారం) ఘన విజయం సాధించింది.  దీంతో ఇపుడు  వీరిద్దరి కాంబినేషన్లో  రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement