మా ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం అయితే ఉంది! | Family comes first for Deepika Padukone and Ranveer Singh! | Sakshi
Sakshi News home page

మా ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం అయితే ఉంది!

Published Sun, Jul 5 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

మా ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం అయితే ఉంది!

మా ఇద్దరి మధ్య ఏదో ఒక బంధం అయితే ఉంది!

 ‘‘రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ఇద్దరితోనూ నాకు మంచి హిట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరితో మంచి కెమిస్ట్రీ కుదిరిందని అడిగితే ఏం చెప్పను? ఆ విషయంలో నాకు ఇప్పటికీ కన్‌ఫ్యూజన్ ఉంటుంది’’ అని బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనే అంటున్నారు. దీని గురించి మాట్లాడుతూ- ‘‘రణ్‌బీర్‌తో నేను ‘ఏ జవానీ హై దివానీ’, ‘బచ్‌నా ఏ హసీనో’ చిత్రాల్లో నటించాను. అప్పుడు మా జంట సూపర్ అన్నారు. అలాగే రణ్‌వీర్ సింగ్‌తో ‘గోలియోంకా రామ్‌లీలా’ లో నటించా. మా జంటను కూడా ఆకాశానికెత్తేశారు’’ అని అన్నారు. ఇక రణ్‌బీర్ కపూర్‌తో ముగిసిపోయిన ప్రణయ బంధం గురించి మాట్లాడుతూ- ‘‘మేమిద్దరం విడిపోయినా కానీ, రణ్‌బీర్ ప్రభావం నా జీవితం మీద కచ్చితంగా ఉంటుంది. ప్రేమికులుగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు మేం మాట్లాడుకోకపోవచ్చు. కానీ, మా మధ్య ఒక బంధం ఉంది. అయితే, అది  స్నేహమా...ప్రేమా అనేది కచ్చితంగా చెప్పలేను. అంతకు మించిందేదో ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement