దీపిక మాజీ లవర్‌కు రణ్‌వీర్‌ షాకిచ్చాడా? | After Partying Together, Ranveer Took A Subtle Jibe At Ranbir | Sakshi
Sakshi News home page

దీపిక మాజీ లవర్‌కు రణ్‌వీర్‌ షాకిచ్చాడా?

Published Wed, Jul 27 2016 12:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

దీపిక మాజీ లవర్‌కు రణ్‌వీర్‌ షాకిచ్చాడా?

దీపిక మాజీ లవర్‌కు రణ్‌వీర్‌ షాకిచ్చాడా?

దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తాజాగా ఒకే వేదికపై కనిపించడమే కాదు.. కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. వీరు కలివిడిగా ఉండటం చూసి ఇంటర్నెట్‌ కూడా మురిసిపోయింది. వీరి మధ్య ఎలాంటి విభేదాలుగానీ, వ్యక్తిగత కక్షలుగానీ లేనందుకు సంతోషపడి.. మెచ్చుకుంది కూడా.

రణ్‌బీర్‌ కపూర్, దీపికా పదుకొనే మాజీ ప్రేమికులు అన్న సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు ప్రేమించుకున్న ఈ జంట గతంలో విడిపోయింది. రణ్‌బీర్‌ కపూర్ కొంతకాలం కత్రీనా కైఫ్‌తో డేటింగ్ చేశాడు. రణ్‌బీర్ తో విడిపోయిన తర్వాత కొంత డిప్రెషన్‌కు గురైన దీపిక ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌తో స్నేహంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ‘బాజీరావు మస్తానీ’ జంట ప్రేమించుకుంటున్నట్టు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని పక్కనబెడితే.. తాజాగా ఈ ముగ్గురూ స్నేహితుల్లా కలిసిపోయి.. పార్టీ చేసుకున్న తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ఓ ట్విస్టు ఇచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ దీపికకు ఏ కష్టం రాకుండా బాగా చూసుకునే రణ్‌వీర్ సింగ్.. ఈ పార్టీ అనంతరం విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ గురించి అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘ఆ అమ్మాయి (దీపిక) వెంట ఇంటికి ఎవరు వెళుతున్నారో చూడండి’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. పాపం మాజీ లవర్ రణ్‌బీర్‌ కపూర్.. ఈ ఆన్సర్‌ తప్పకుండా ఆయనకు షాకిచ్చి ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement