కత్తి దూసిన కంగన! | Kangana Ranaut's role in 'Rangoon' revealed | Sakshi
Sakshi News home page

కత్తి దూసిన కంగన!

Published Wed, Jul 29 2015 11:55 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కత్తి దూసిన కంగన! - Sakshi

కత్తి దూసిన కంగన!

ఇప్పుడు బాలీవుడ్ ‘క్వీన్’ ఎవరంటే నిస్సందేహంగా కంగనా రనౌతే అని చెప్పచ్చు. వరుసగా ఆమె సినిమాలు సక్సెస్ అవుతుండడంతో దర్శక, నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పిన కథ బాగా నచ్చ డంతో ‘రంగూన్’ సినిమాకు కంగన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో బ్రాడ్‌వే థియేటర్ ఆర్టిస్ట్ ‘జూలియా’ అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్రకు అనుగుణంగా ఆమెకు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు వచ్చి తీరాలట. అందుకోసం కేరళ, జైపూర్‌ల నుంచి శిక్షకులను రప్పించారట దర్శక, నిర్మాతలు. అయితే ఇదేమీ చారిత్రక కథాంశమో, యాక్షన్ సినిమా కాదనీ, న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే థియేటర్ చుట్టూ తిరిగే కథ అనీ సమాచారం.
 
 సంజయ్‌దత్ భార్యగా?
  ‘రంగూన్’  కోసం సన్నాహాల్లో ఉన్న కంగన, మరో భారీ చిత్రంలో కూడా నటించనున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితకథ ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ  తెరకెక్కించనున్న చిత్రంలో సంజయ్‌దత్ భార్య మాన్యత పాత్ర లో ఆమె కనిపించనున్నారని సమాచారం. సంజయ్‌దత్‌గా రణబీర్‌కపూర్ నటించే అవకాశం ఉందని బోగట్టా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement