కత్తిలాంటి కత్రినా ఖంగుమనే కంగనా
ఫిట్‌నెస్
కంగనా రనౌత్‌ను చూడండి. అప్పటికీ ఇప్పటికీ ఆమె బాడీలో గ్లామరస్ చేంజెస్. మొదట్లో మరీ సన్నగా కనిపించిన ఆమె, ఆ తర్వాత కొంచెం పుష్టిగా తయారయ్యారు. కంగనా మాంసాహారి. గ్రిల్డ్ చికెన్, ఫిష్ తింటారు. ఇంకా ఏమేం తీసుకుంటారు? వర్కవుట్ చేసే విధానం ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
కత్రినా కైఫ్ బాలీవుడ్‌కొచ్చిన కొత్తలో ఇంతలా ఫిట్‌గా... గ్లామరస్‌గా లేరు. ఏం తిన్నారో... ఏం వర్కవుట్స్ చేశారో కానీ, ఆ తర్వాత కత్తిలా తయారయ్యారు. బేసిక్‌గా ఆమె మాంసాహారి. ఫిష్ బెస్ట్ అంటారామె. చికెన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కోడికి కత్రినా దూరం. అలాగే, ఫ్రైడ్ ఫుడ్స్ అస్సలు తీసుకోరు. ఇక, ఆమె ఏమేం తీసుకుంటారో? ఎలా వర్కవుట్ చేస్తారో? తెలుసుకుందాం.
డైట్
ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగుతారు
బ్రేక్‌ఫాస్ట్
మొలకెత్తిన ధాన్యాలు, ఎగ్‌వైట్స్‌తో తయారు చేసిన ఆమ్లెట్స్. ఆ తర్వాత ఓ గంటకు ప్రొటీన్ షేక్, ఫ్రూట్స్
లంచ్
రోటీ, రైస్, గ్రిల్స్ చికెన్, పప్పు, వెజిటెబుల్ సలాడ్స్,
ఈవినింగ్ స్నాక్స్‌కి బ్రౌన్ బ్రెడ్, ఎగ్ వైట్‌తో తయారు చేసిన శాండ్‌విచ్ తీసుకుంటారు
డిన్నర్
లంచ్‌కి తీసుకున్న మెనూనే డిన్నర్‌కి కూడా ఫాలో అవుతారు. కాకపోతే రోటీకి బదులు సూప్ తీసుకుంటారు.
వారంలో ఐదు రోజులు జిమ్ చేయాల్సిందే. గంట నుంచి రెండు గంటలు చేస్తారు.
కిక్ బాక్సింగ్, పవర్ యోగా తప్పనిసరి. పది నిమిషాల ధ్యానం.
కంగనా పర్సనల్ ట్రైనర్ లీనా మోగ్రే. ఆ ట్రైనర్ సమక్షంలో కార్డియో వర్కవుట్స్, పుల్ అప్స్, పుష్ అప్స్ చేస్తారు.
షూటింగ్స్‌తో బిజీ కారణంగా జిమ్ సెంటర్‌కి వెళ్లే వీలు లేకపోతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు.
అప్పుడప్పుడూ స్విమ్మింగ్, జాగింగ్ చేస్తారు. రోజూ 15 నిమిషాలైనా వాకింగ్‌కి కేటాయిస్తారు.
ఉదయం నిద్ర లేవగానే నాలుగు గ్లాసులు నీళ్లు తాగుతారు.
బ్రేక్‌ఫాస్ట్
ఓట్‌మీల్, ఎగ్ వైట్, దానిమ్మ జ్యూస్
అల్పాహారం తీసుకున్న రెండు గంటలకు ఫ్రూట్స్ లేక ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటారు
లంచ్
బ్రౌన్ రైస్ లేక రెండు సైస్‌లు బ్రౌన్ బ్రెడ్, గ్రిల్డ్ ఫిష్, పప్పు, వెజిటెబుల్ సలాడ్
ఈవినింగ్ స్నాక్స్‌కి డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ తీసుకుంటారు
డిన్నర్
నిద్రపోయే రెండు గంటల ముందే డిన్నర్ ముగించేస్తారు. వెజిటెబుల్ సూప్, రెండు రోటీలు, పప్పు కూర, వెజిటెబుల్ సలాడ్.
ఫిట్‌నెస్ మంత్ర
అసహజమైన పద్ధతిలో (శస్త్ర చికిత్స) సులువుగా సన్నబడిపోవచ్చు. కానీ, అది ఆరోగ్యానికి మంచిది కాదు. సహజం సిద్ధంగానే తగ్గాలి.
అందుకు తగ్గట్టుగా డైట్, వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవాలి. వర్కవుట్స్ పరంగా మనం పడే కష్టం మనకు ఉపయోగమే కాబట్టి, శ్రద్ధగా చేయాలి.
మనసు ప్రశాంతంగా ఉంటే బయటికి అందంగా కనిపిస్తాం. మానసికంగా ఆందోళన పడితే ఎన్ని వర్కవుట్లు చేసినా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఉపయోగం ఉండదు. అందుకని, ప్రశాంతంగా ఉంటూ, మంచి డైట్ తీసుకోవడంతో పాటు, వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం, అందం రెండూ మన సొంతమవుతాయి.