క్రైమ్ జరిగింది. క్లూస్ నిల్. ఆధారాలు కనిపెట్టే అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. కానీ కేస్‌లో దోషులకు శిక్ష పడాలి. ఎలా? అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మిస్టర్ జేమ్స్. కూపీ లాగుతూ దోషులను బయటపెట్టాడు. మరి జేమ్స్ ఎలా కనిపెట్టాడు? జేమ్స్‌తో గేమ్స్ ఆడాలనుకున్న వారి ఆట ఎలా కట్టించాడు? అనే కథాంశంతో సాగే సినిమా ‘స్ట్రీట్‌లైట్స్’. ప్లై హౌస్ మోషన్ పిక్చర్స్ ప్రైవెట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు కెమెరామెన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకత్వం వహించారు.
తమిళ, మలయాళ సినిమాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన శ్యామ్‌దత్ పదేళ్ల క్రితం తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. తమిళ, మలయాళం భాషలతోపాటుగా తెలుగులోనూ ‘స్ట్రీట్‌లైట్ ’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘మమ్ముట్టి నటించిన సినిమాలు తెలుగులో పెద్ద విజయాలు సాధించాయి. అందుకే ‘స్ట్రీట్‌లైట్స్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. శ్యామ్‌దత్ కథ, కథనం ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి’’ అన్నారు చిత్రబృందం. స్టంట్ శివ, మొట్ట రాజేంద్ర, పాండిరాజన్ కీలకపాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: ఆదర్శ్ అబ్రహం.
Comments
Please login to add a commentAdd a comment