మా అమ్మానాన్న అంటే నాకు ద్వేషం! | Parinity Chopra says that he hates parents in his childhood | Sakshi
Sakshi News home page

మా అమ్మానాన్న అంటే నాకు ద్వేషం!

Published Wed, May 24 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

మా అమ్మానాన్న అంటే నాకు ద్వేషం!

మా అమ్మానాన్న అంటే నాకు ద్వేషం!

ప్రపంచంలో ఎవరినైనా ద్వేషిస్తాం కానీ, తల్లిదండ్రులను మాత్రం ద్వేషించలేం. అయితే చిన్నతనంలో తల్లిదండ్రులను తాను బాగా ద్వేషించేదాన్నని పరిణీతి చోప్రా అన్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆమె ద్వేషానికి కారణం ఉంది. దాని గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మాకు ఆర్థిక కష్టాలు ఉండేవి. పెద్ద బంగ్లా, కారు వంటివి ఉండేవి కాదు.

నన్ను సైకిల్‌లో స్కూల్‌కి పంపించేవాళ్లు. సైకిల్‌ తొక్కుకుంటూ నేను వెళుతుంటే, అబ్బాయిలు అల్లరి పెడతారేమోనని మా నాన్నగారు ఇంకో సైకిల్‌లో నా వెనకాలే వచ్చేవారు. అయితే నాన్న రానప్పుడు అబ్బాయిలు నన్ను బాగా ఎగతాళి చేసేవారు. నా స్కర్ట్‌ని లాగడానికి ట్రై చేసేవాళ్లు. నాకు చాలా భయం వేసేది. మినీ స్కర్ట్‌ వేసుకుని, అబ్బాయిల ముందు సైకిల్‌ తొక్కడం ఇబ్బందిగా అనిపించేది. నన్ను సైకిల్‌లో పంపిస్తున్నందుకు మా అమ్మానాన్నల మీద ద్వేషం పెంచుకున్నా.పెద్దయ్యాక వాళ్ల కష్టాలను అర్థం చేసుకున్నా. ఆ ద్వేషం స్థానంలో జాలి, ప్రేమ పెరిగాయి’’ అన్నారు.

ఇంతకీ పరిణీతి చిన్నప్పటి ఈ సంఘటనను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నారంటే... హీరో అక్షయ్‌కుమార్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌ వచ్చు. ఆడవాళ్లకు ఆత్మ రక్షణ అవసరం అంటూ ఓ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, ఫీజు లేకుండా వాళ్లకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఆర్ట్‌ నేర్పించే ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసి, బయటకు వెళ్లే స్టూడెంట్స్‌కి ‘సెండాఫ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తున్న అక్షయ్‌ని అభినందించారామె. చిన్నప్పుడు తాను భయపడి నట్లుగా ఎవరూ భయపడకూడదని మహిళలకు సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement