కో డైరెక్టర్ పై రేప్ కేసు.. అరెస్టు | 'Peepli Live' co-director arrested on rape charges | Sakshi
Sakshi News home page

కో డైరెక్టర్ పై రేప్ కేసు.. అరెస్టు

Published Sun, Jun 21 2015 3:07 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

కో డైరెక్టర్ పై రేప్ కేసు.. అరెస్టు

కో డైరెక్టర్ పై రేప్ కేసు.. అరెస్టు

న్యూఢిల్లీ: కామెడీతోపాటు ఆత్మహత్యలు ప్రధానంగా చేసుకొని వచ్చిన 'పీప్లీ లైవ్' చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేసిన మహ్మద్ ఫారూకీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు నమోదయినట్లు పోలీసులు తెలియజేశారు. 35 ఏళ్ల ఓ అమెరికన్ వనితపై ఫారూకీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఈకేసులో పేర్కొన్నారు. 2015 మర్చి 28న పీప్లీ లైవ్ కో డైరెక్టర్ అమెరికన్ వనితపై లైంగికదాడికి పాల్పడ్డాడని, జూన్ 19న కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అరెస్టు చేసిన అతడిని సాకేత్ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు అతడికి జూలై 6వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అమెరికన్ మహిళ ఓ పనిపై భారత్ వచ్చిన సమయంలో అతడు ఈ పని చేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి నిర్మాతగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement