మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ | Taapsee Eyeing the Biopic of Indian Women Cricketer Mithali Raj | Sakshi
Sakshi News home page

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

Published Sat, Sep 7 2019 10:32 AM | Last Updated on Sat, Sep 7 2019 10:34 AM

Taapsee Eyeing the Biopic of Indian Women Cricketer Mithali Raj - Sakshi

నటి తాప్సీని క్రీడలు వెంటాడుతున్నాయి. ఏ రంగం అయినా సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. అందుకు సినిమా అతీతం కాదు. ఈ సక్సెస్‌ కారణంగానే నటి తాప్సీని క్రీడలు వెంటాడుతున్నాయి. ఆరంభంలో ఈ అమ్మడు అందాలనే నమ్ముకుంది. అయితే అవి తాప్సీ కెరీర్‌కు కొంత వరకే ఉపయోగపడ్డాయి. గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చి పెట్టింది కానీ, స్టార్‌ హీరోయిన్‌ చేసింది మాత్రం ఆమె అభినయమే.

హిందీ చిత్రం నామ్‌ షబ్నా, పింక్‌ వంటివి తాప్సీలోని నటిని వెలికి తీశాయి. ఇప్పుడీ అమ్మడు టాప్‌ హీరోయిన్‌. అంతేకాదు క్రీడల నటిగా ముద్రవేసుకుంది. ఇటీవల తాప్సీ అన్నీ క్రీడలతో కూడిన కథా చిత్రాల్లోనే నటించడంతో ఆ ముద్ర పడింది. దీని గురించి తాప్సీ వివరిస్తూ గత చిత్రం క్రీడానేపథ్యంలో రూపొందడంతో తాజా చిత్రాన్ని వేరే కొత్త నేపథ్యంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్న ఆలోచన ఏమీ తనకు లేదని చెప్పింది.

వరుసగా క్రీడా నేపథ్య కథల్లోనే నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు సూర్మ అనే హిందీ చిత్రంలో హాకీ క్రీడాకారిణిగా నటించింది. ఆ తరువాత సాత్‌ కీ ఆంగ్‌ చిత్రంలో షూటర్‌గా నటించింది. ప్రస్తుతం రష్మీ రాకెట్‌ చిత్రంలో అథ్లెట్‌ గా నటిస్తోంది. భారత మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలిరాజ్‌ బయోపిక్‌లో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సమాచారం.

తనకు మంచి పాత్రలు వస్తున్నాయని, అందుకే అవి క్రీడా పాత్రలు అయినా వదులు కోవడంలేదని చెప్పింది. మంచి కథలను ఎంచుకునే పరిపక్వత తనకు ఉందని అంది. త్వరలో ఈ జాన తమిళంలో జయంరవితో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. గేమ్‌ చిత్రం తరువాత ఈ అమ్మడు తమిళంలో నటించే చిత్రం ఇదే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement