బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా! | Title Locked For Allu Arjun, Trivikram Srinivas Film | Sakshi
Sakshi News home page

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

Published Thu, Jul 25 2019 1:27 PM | Last Updated on Thu, Jul 25 2019 1:27 PM

Title Locked For Allu Arjun, Trivikram Srinivas Film - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మరోసారి ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాకు నేను నాన్న అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, రావూ రమేష్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement