కరోనా అలర్ట్‌ : మహేష్‌బాబు సూచనలు | Tollywood Superstar Mahesh Babu Suggestions On Corona | Sakshi
Sakshi News home page

కరోనా అలర్ట్‌ : మహేష్‌బాబు సూచనలు

Published Tue, Mar 17 2020 12:09 PM | Last Updated on Tue, Mar 17 2020 12:23 PM

Tollywood Superstar Mahesh Babu Suggestions On Corona - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పల జాగ్రత్తలు పాటించాలని టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కోవిడ్‌ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ... మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు. (కరోనాపై రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వీడియో)

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇప్పటికే సందేశాన్ని అందించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన ఆరు సూత్రాలు పాటిస్తే కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వారు సూచించారు. మరోవైపు వైరస్‌ కారణంగా టాలీవుడ్‌తో సహా అన్ని చిత్రపరిశ్రమలు షూటింగ్స్‌ను వాయిదా వేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement