భయం పోయిందా? | trisha next movie also horror movie | Sakshi
Sakshi News home page

భయం పోయిందా?

Published Sun, May 8 2016 12:45 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM

భయం పోయిందా? - Sakshi

భయం పోయిందా?

మీకెలాంటి సినిమాలంటే ఇష్టం? అని త్రిషను అడిగితే.. మంచి లవ్‌స్టోరీస్, యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం అని చెబుతారు. మరి... హర్రర్ మూవీస్ అంటే ఇష్టం లేదా? అనడిగితే.. ‘‘వామ్మో.. అవంటే నాకు చాలా భయం. చూడ్డానికి ఇష్టపడను. అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే, ‘నో’ చెప్పేస్తానేమో’’ అనేవారు. అలాంటి త్రిష వరుసగా హర్రర్ మూవీస్‌లో నటిస్తున్నారు. ఆ మధ్య హర్రర్ మూవీ ‘కళావతి’లో నటించారు. తాజాగా ‘నాయకి’ అనే మరో హర్రర్‌లో యాక్ట్ చేశారు.

ఇప్పుడు ముచ్చటగా మూడో హర్రర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వరుసగా హర్రర్ మూవీస్ చేస్తున్నారంటే... ఆ తరహా సినిమాల మీద త్రిషకు ఉన్న భయం పోయినట్లేగా! ఇక, తాజాగా ఆమె అంగీకరించిన హర్రర్ మూవీ విషయానికొస్తే.. ఇది తమిళ చిత్రం. ఇంకా టైటిల్ పెట్టలేదు. మాదేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. మెర్విన్ సాల్మన్-వివేక్ అనే ఇద్దరు సంగీతదర్శకులు పాటలు స్వరపరచనున్నారు. ఈ నెలాఖరున షూటింగ్ ఆరంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను 30 రోజుల పాటు లండన్‌లో జరపనున్నారు. అత్యధిక శాతం షూటింగ్ అక్కడే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement