విద్యా మమ్మీనే నాకు స్పూర్తి! | Vidya Balan my inspiration, says Patralekha | Sakshi
Sakshi News home page

విద్యా మమ్మీనే నాకు స్పూర్తి!

Published Tue, May 27 2014 6:31 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

విద్యా మమ్మీనే నాకు స్పూర్తి!

విద్యా మమ్మీనే నాకు స్పూర్తి!

ముంబై: హన్సల్ మెహతా తాజాగా తీస్తున్న సిటీ లైట్స్ ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న పత్రలేఖకు ప్రముఖ నటి విద్యాబాలన్ అంటే ఇష్టమట. ఆమెనే స్పూర్తిగా  తీసుకునే తాను ఈ రంగంలో ముందుకు వెళతానని ఢంకా బజాయించీ మరీ చెబుతుంది ఈ చిన్నది. ' విద్యా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నటించిన సినిమాలనే ఎక్కువగా చూస్తుంటాను. 2005 లో వచ్చిన పరిణీత చిత్రంతో విద్యాబాలన్ నటనకు ఫిదా అయిపోయా. అప్పట్నుంచీ ఆమెనే అనుసరిస్తూ ఉంటానని' తెలిపింది. 

 

విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్స్, కహానీ వంటి చిత్రాలు మాదిరి తాను కూడా విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు మనసులో మాటను బయటపెట్టింది. ఇదిలా ఉండగా ఈ మధ్యే విద్య తన భర్తతో కలిసి ఓ స్టూడియోలో సిటీ లైట్స్ చూసి.. పత్రలేఖ నటనకు కితాబు  ఇచ్చింది.  ఇక సిటీ లైట్స్‌లో హీరో రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఈమె కనిపిస్తోంది. వీళ్లిద్దరూ ఇందులో రాజస్థాన్ గ్రామీణ దంపతులుగా కనిపిస్తారు. బ్రిటిష్ సినిమా మెట్రో మనీలా ఆధారంగా దీనిని తీస్తున్నారు. ఇది ఒక సామాన్యుడి గురించి వివరించే సినిమాగా రూపొందినట్టు టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement