ఉగ్రవాదులకు మరణశిక్ష
కోల్‌కతా: పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు పశ్చిమబెంగాల్ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. పాక్‌కు చెందిన మొహమద్ యూనస్, అబ్దుల్లాతో పాటు భారతీయుడైన ముజఫర్ అహ్మద్ రాథోడ్‌ను 2007లో బీఎస్‌ఎఫ్ జవాన్లు భారత్–బంగ్లా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వీరిపై నమోదైన కేసును విచారించిన పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాన్‌గాన్‌లోని న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. అబ్దుల్లా కరాచీ నివాసి కాగా, యూనస్ స్వస్థలం హరిపూర్ అని చెప్పారు. ఇక రాథోడ్ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నుంచి వచ్చాడు.