సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో నైపుణ్యంతో, నిజాయితీగా పనిచేసే సిబ్బందికి, కార్మిక అభివృద్ధికోసం పనిచేసిన 338 మందిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ‘ప్రధాన మంత్రి శ్రమ్’పురస్కారాలతో సత్కరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ఈ అవార్డులను గత ఆరేళ్లకుగానూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు.
హైదరాబాద్‌లోని బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కె.రామ్‌ప్రసాద్, హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు చెందిన సి.కుమార్, జి.గోవర్దన్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, రాజేందర్ ప్రసాద్ పురస్కారాలు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment