ఢిల్లీ : లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగిని అరెస్ట్ చేసి తిరిగి ఆసుపత్రికి తరలించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కరోనా పాజిటివ్ అని తేలిని వ్యక్తి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడ్నుంచి పారిపోయాడు. పోలీసులు గాలింపు చేపట్టగా శనివారం హర్యానా రాష్ట్రంలోని రాయ్ గ్రామం వద్ద కనిపించాడు,. దీంతో ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఇక్కడిదాకి బాగానే ఉన్నా పోలీసులకు మరో కొత్త సమస్య ఎదురైంది. అదేంటంటే ఈ వ్యక్తి మార్గమధ్యంలో ఎవరెవరిని కలిశాడన్నది. ప్రస్తుతం ఇదే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఇక దేశ రాజధానిలో శనివారం ఒక్కరోజే 67 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,707 కు చేరింది. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 42 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్యను పెంచింది. కొత్తగా మాల్వియా నగర్, జహంగీర్ పురి ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లలో చేర్చారు. ప్రస్తుతం ఢిల్లీలో 68 కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి వారికి కావల్సిన నిత్యావసరాలను ఇళ్ల వద్దకే పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment