రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ! | Devendra Fadnavis ministry expansion on Dec 5 | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ!

Published Wed, Dec 3 2014 6:21 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM

రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ! - Sakshi

రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ!

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గాన్ని ఈనెల ఐదో తేదీ.. శుక్రవారం విస్తరించనున్నారు. శివసేనతో పొత్తు కుదిరిందని వస్తున్న కథనాల నేపథ్యంలో ఈ విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 20 మంది వరకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వాళ్లలో సగం మందికి పైగా శివసేన సభ్యులే ఉంటారంటున్నారు.

అసెంబ్లీ భవనం ప్రాంగణంలో 5వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిసిన దేవేంద్ర ఫడ్నవిస్.. కొత్త మంత్రుల జాబితాను ఆయనకు చూపించారని, విస్తరణకు అనుమతి కూడా తీసుకున్నారని సమాచారం. బీజేపీ సీనియర్ నాయకులు గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, బాబన్రావు లోనికర్, శంభాజీ పాటిల్ నీలంగేకర్ పదవులు పొందొచ్చని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement