- రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీతో జైట్లీ భేటీ
- రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులపై ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లుపై ముందడుగు పడింది. మంగళవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జరిపిన భేటీలో దీనిపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. పన్నురేట్లు ప్రస్తుతానికంటే తగ్గించాలన్న నిర్ణయంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. రాష్ట్రాలు తొలి ఐదేళ్లలో ప్రత్యక్ష పన్నుల్లో నష్టపోతే పరిహారం అందించే విషయాన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చేందుకూ సమావేశంలో అంగీకారం కుదిరింది.
ఈ బిల్లు ద్వారా సామాన్య పన్ను చెల్లింపు దారుడితోపాటు మామూలు వ్యాపారులు లాభం పొందుతారని(పన్ను రేట్ల తగ్గింపు), రాష్ట్రాలకు ఆదాయంలో నష్టం ఉండదని.. ఆర్థికమంత్రుల సాధికార కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. రూ. కోటిన్నర టర్నోవర్ ఉన్న వ్యాపారాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ంతకు మించిన వ్యాపారాలను కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నియంత్రిస్తాయన్నారు. ప్రభుత్వం ఈ బిల్లును వచ్చేవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. కాగా, కాంగ్రెస్ కోరుతున్నట్లు 1 శాతం అదనపు పన్ను రద్దుకు జైట్లీ అంగీకరించారు. అయితే కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ జీఎస్టీపై కేంద్రం చెప్పిన దాన్ని ఏకాభిప్రాయంతో అంగీకరించినట్లు మిత్రా తెలిపారు.
జీఎస్టీపై ముందడుగు
Published Wed, Jul 27 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
Advertisement
Advertisement