వారణాసి: లాక్‌డౌన్‌లో పేదలు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ దత్తత గ్రామం దొమారిలో పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఓ మీడియా జర్నలిస్టు కథనం రాశారు. లాక్‌డౌన్‌లో ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. అయితే ఇందులో ఉన్న అంశాలు అవాస్తవమంటూ స్థానిక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సదరు కథనం రాసిన 'స్క్రోల్ ఇన్' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియ శర్మ, ప్రధాన ఎడిటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (జర్నలిస్టులపై కరోనా పంజా!)
దీనిపై స్క్రోల్ ఇన్ మీడియా స్పందిస్తూ.. ఇది జర్నలిస్టుల స్వేచ్ఛను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలోనూ పని చేస్తున్న పాత్రికేయులను బెదిరించడమేనని మండిపడింది. కాగా వారణాసి పరిధిలో ఉండే దొమారి గ్రామాన్ని "సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన" కింద ప్రధాని మోదీ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. (ఇది అతిపెద్ద సంస్కరణ: ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment