యజ్ఞం నిర్వహిస్తున్న కాశ్మీరీ పండిట్లు
శ్రీనగర్ : కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి కాశ్మీరీ పండిట్లు శనివారం యజ్ఞం నిర్వహించారు. జమ్మూకశ్మీర్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటిన నేపథ్యంలో జమ్మూ సిటీ కాశ్మీర్ పండిట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మహంత్ రోహిత్ శాస్త్రి అనే పండిట్ మాట్లాడుతూ.. ‘‘ ఈ గడ్డు పరిస్థితుల్లో మా ప్రార్థనలు ప్రజలకు శక్తినిస్తాయి. ఈ యజ్ఞం వారికి అంతర్ దృఢత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రజలు కచ్చితంగా లాక్‌డౌన్ నియమాలను పాటించాలి. సోషల్ డిస్టన్స్‌ను పాటించాలి’’ అని పేర్కొన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటివరకు 1013 కేసులు నమోదయ్యాయి. 513 మంది కోలుకోగా 11 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పుట్టిళ్లు చైనాను సైతం భారత్ వెనక్కు నెట్టేసింది. దాదాపు 86 వేల కేసులతో ప్రపంచంలోనే 11వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment