యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది? | Nitish advises Amit Shah to practise yoga | Sakshi
Sakshi News home page

యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?

Published Sat, Jun 13 2015 7:53 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది? - Sakshi

యోగాకు సరిపోయే ఒళ్లేనా నీది?

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని ఉద్దేశించి నితీశ్ కుమార్ వ్యాఖ్య

యోగా దినోత్సవ సందర్భంగా పాట్నాలో జరిగే కార్యక్రమానికి అమిత్ షా

బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ స్టంట్గా నితీశ్ అభివర్ణన


పాట్నా: యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.  ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు.

తాను ఎన్నో ఏళ్లుగా ఇంట్లోనే యోగా చేస్తున్నానని, కానీ ఏ రోజూ పబ్లిసిటీ కోసం చేయలేదని నితీశ్ కుమార్ తెలిపారు. బీజేపీ మాత్రం యోగాను ఒక పబ్లిక్ స్టంట్లా చేస్తోందని విమర్శించారు. పాట్నాలో నిర్వహించే యోగా కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటున్న విషయం పేపర్లో చూస్తే తెలిసిందన్నారు. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేస్తున్న పొలిటికల్ స్టంట్ గా నితీశ్ అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement