సీఎం యోగికి రాహుల్ చురకలు..
న్యూఢిల్లీ: రైతు రుణాల మాఫీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వాగతించారు. కొత్త సీఎం యోగి సరైన దారిలో నడుచుకుంటున్నారని, అయితే ఆ మాఫీ సగం రైతులకే ఉపశమనం కలిగించిందన్నారు. కాంగ్రెస్ ఒత్తిడి చేయడంతోనే ఆ మాత‍్రమైనా రుణ మాఫీ చేశారని సీఎం యోగికి రాహుల్ చురక అంటించారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని.. రైతుల జీవితాలతో రాజకీయాలు తగవని రాహుల్ హెచ్చరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం యోగి తొలి కేబినెట్ సమావేశంలో రూ.30 వేలకోట్లకు పైగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీజేపీ.. కేవలం రూ.లక్ష లోపు రుణాలు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఒత్తిడి చేసి ఉండకపోతే ఆ మాత్రం మాఫీ కూడా బీజేపీ ప్రభుత్వం చేసి ఉండేది కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని, పక్షపాత ధోరణి మంచిది కావని హితవు పలికారు. దేశవ్యాప్తంగా రైతులు రుణాల ఊభిలో చిక్కుకున్నారని, అన్ని రాష్టాల రైతులకు న్యాయం చేయాలన్నారు.
Congress supports loan waiver for farmers bt this is only partial relief.Central Gov must respond to ease distress of farmers across country pic.twitter.com/2hU14cCjVc
— Office of RG (@OfficeOfRG) 5 April 2017
A partial relief for UP farmers, but a step in the right direction. @INCIndia has always supported loan waivers for farmers in distress(1/3)
— Office of RG (@OfficeOfRG) 5 April 2017
I'm happy BJP has finally been forced to see reason.But let's not play politics with our farmers who are suffering across the country(2/3)
— Office of RG (@OfficeOfRG) 5 April 2017