ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకునేందుకే వెళ్లాడని కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత ఏకే ఆంటోనీ అన్నారు. సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు ముందు రాహుల్ కనిపించకుండా పోవడంపై వచ్చిన పలు విమర్శలకు ఈ వివరణ ఇచ్చారు. రాహుల్ మరింత శక్తిమంతంగా, పార్టీని వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తిగా వస్తారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆంటోనీ అన్నారు.
రాహుల్ను చూసి భయపడేవాళ్లే అనవసరమైన వివాదాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. రాహుల్ కొంతసమయం విశ్రాంతి తీసకుంటున్నాడే తప్ప.. పార్టీ కార్యకలాపాలనుంచి పూర్తిగా తప్పుకుంటాడని ఏ ఒక్కరు భ్రమపడొద్దని, అలాంటి కలలు కనడం మానుకోవాలని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా కలిసి కేంద్రంలో కాంగ్రెస్కు తిరిగి అధికారాన్ని సంపాధించి పెడతారని ధీమా వ్యక్తం చేశారు.
మరింత శక్తిమంతుడిగా రాహుల్...
Published Sun, Mar 1 2015 5:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement