పురచ్చితలైవి నిలిచి గెలిచింది.... | jayalalitha always win | Sakshi
Sakshi News home page

పురచ్చితలైవి నిలిచి గెలిచింది....

Published Wed, May 13 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

పురచ్చితలైవి నిలిచి గెలిచింది....

పురచ్చితలైవి నిలిచి గెలిచింది....

అధికారంలోకి వచ్చినప్పుడల్లా జయలలితను కేసులతో కల్లోలపరచాలని చూసిన డీఎంకే అన్నిసార్లూ భంగపడింది. ఇపుడు తీర్పు జయలలితకు అనుకూలంగా వచ్చినా ఈ 19 ఏళ్లపాటు కేసుల కారణంగా చవిచూడాల్సి వచ్చిన రాజకీయ ఎత్తుపల్లాలు.. అన్నిటినీ మించి ఆమె అనుభవించిన మానసిక క్షోభ తీరేది కాదు.
 బొద్దుగా బిడియంగా కనిపి స్తున్నదంటూ తిరస్కరించిన దర్శకనిర్మాతలు ఆ తర్వాత ఆమె కాల్షీట్ల కోసం ఇంటి ముందు పడిగాపులు పడ్డారు....
 ఎంజీఆర్‌ను బుట్టలో వేసుకున్న మాయలాడి అం టూ ఆయన అంత్యక్రియల ఊరేగింపు నుంచి తోసి వేసిన నేతలే ఆ తర్వాత ఆమె పాదాలు తాకే అదృష్టం కోసం చేతులు కట్టుకుని నిలబడ్డారు...
 ప్రతిపక్షనేత.. అందునా ఓ మహిళ... అయినా ఆమెకు కనీస మర్యాద ఇవ్వాలన్న ఇంగితమైనా లేకుం డా ఆమెపై మైకులు విసిరిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఆమె కనిపిస్తే వంగివంగి సలాములు కొట్టారు...
 ప్రత్యర్థుల రాజకీయ కక్షసాధింపు కారణంగా వెం టాడి వేధించిన 13 కేసులు దూదిపింజెల్లా తేలిపోయి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించాయి....
 అన్నిటినీ మించి పందొమ్మిదేళ్లపాటు ఆమెను ఎంతగానో వేధించిన ‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసు’ రాజకీయ ప్రేరేపితమైనదిగా తేలిపోయింది.
 ఆమె ఎవరో కాదు కోమలవల్లి.. అలియాస్ జయ లలిత.. ఈ పేరు మూడున్నర దశాబ్దాలుగా వర్తమాన భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తమిళనాట ఆమె పురచ్చితలైవి.. అంటే... విప్లవయోధురాలు అని అర్థం. ప్రత్యర్థులంతా ఒక్కటై వేధించినా ఏ మాత్రం చలించ కుండా స్థిరంగా నిలిచి పోరాడిన జయలలితకు అది చక్కగా నప్పుతుంది. అందుకే ఆమె నేడు గెలిచింది. ఎం తటి విపత్కర పరిస్థితులెదురైనా స్థయిర్యాన్ని కోల్పోని స్వభావమే జయలలితను తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది.
 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు జయలలితకు ఎక్కడలేని ఊరట నిచ్చి ఉంటుంది. అన్నా డీఎంకే మద్దతుదార్ల, ‘అమ్మ’ అభిమానుల ఆనందానికి అవధులే లేవు.
అయితే కర్ణా టక హైకోర్టు తీర్పుపై  రకరకాల వ్యాఖ్యానాలు వినిపి స్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వ్యాఖ్యానించినా, వ్యవహరించినా న్యాయస్థానాన్ని ధిక్కరించిన అభియోగానికి అర్హులవుతారు. అయినా ఎవరి భాష్యం వారిది.  తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఈ తీర్పుపై గగ్గోలు పెడుతున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వానికి కూడా అవి సలహా ఇస్తున్నాయి. జయ నిర్దోషిగా నిర్ధారణైతే సగం మీసం తీసేసుకుంటానని సవాళ్లు విసిరిన విజయకాంత్ వంటి వారు ఇపుడు ఆ విషయాన్ని వదిలేసి తీర్పును తప్పుబట్టే పనిలో బిజీగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా జయలలితను కేసులతో కల్లోల పరచాలని చూసిన డీఎంకే అన్నిసార్లూ భంగపడింది. ఇపుడు తీర్పు జయలలితకు అనుకూలంగా వచ్చినా ఈ 19 ఏళ్లపాటు కేసుల కారణంగా చవిచూడాల్సి వచ్చిన రాజకీయ ఎత్తుపల్లాలు.. అన్నిటినీ మించి ఆమె అనుభవించిన మానసిక క్షోభ తీరేది కాదు.

 1991-96 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా జయ లలిత అధికారాన్ని అడ్డుపెట్టుకుని అపరిమితమైన ఆస్తులు కూడబెట్టారని ప్రస్తుత బీజేపీ నాయకుడు సుబ్ర హ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ అభియోగాలపై ప్రత్యేక న్యాయ స్థానం  ఇచ్చిన తీర్పులో అనేక లోపాలను గుర్తించిన కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా నిర్ధారిం చింది. తమిళనాడు అవినీతి నిరోధక డెరైక్టొరేట్ చేసిన దర్యాప్తు సరిగా లేదని, రాజకీయ కక్షసాధింపుతో ఆమె ఆస్తుల విలువను తప్పుగా మదింపు చేశారని హైకోర్టు తేల్చింది. జయలలిత ఆస్తుల విలువ రూ.37.59 కోట్లు గా హైకోర్టు తేల్చింది.

అభియోగాలలో పేర్కొన్న కాలం లో జయలలిత సంపాదన రూ.34.76 కోట్లుగా మదింపు వేసి వ్యత్యాసం రూ.2.82 కోట్లు మాత్రమేనని న్యాయ స్థానం నిర్ధారించింది. 1994లో రూ.150 లోపు ఉన్న పాలరాయి ధరను రూ.5,000గా లెక్కిస్తే ఎవరైనా నమ్ముతారా? అని తమిళనాడు అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆస్తుల విలు వను అధికంగా చూపారంటూ దాఖలైన పిటిషన్ల విచా రణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని నిర్ధారణకు రావడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.
 రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, పార్టీలకు అతీతంగా కుమ్మక్కు కావడం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగానే పరిపాటిగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్యాప్తు సంస్థలను ఎగదోయడం, లేదా దర్యాప్తు నీరుగారేలా చేయడం వంటి వాటికి కూడా చాలా ఉదాహరణలే చెప్పుకోవచ్చు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారెందరో పడక కుర్చీలో కూర్చుని తాము తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కూడా. పదవిలో ఉండగా చేసిన ‘సేవ’కు గాను ఆ తర్వా త ఆ రాజకీయ పార్టీలలో చేరి తరిస్తున్న అధికారులూ ఉన్నారు.

అధికారంలో ఉన్నవారి ప్రాపకంతో దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం క్షమార్హం కాని నేరం. దర్యాప్తు ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టం చేస్తే విచారణ ప్రక్రియ ఏళ్లకేళ్లపాటు నడవడం సహజమే. దీనివల్ల తప్పు చేసినవారు శిక్షపడకుండా తప్పించుకోవడానికి వీలయినట్లే ఏ తప్పూ చేయనివారు అవినీతి ముద్రతో క్షోభపడుతూ కాలం వెళ్లబుచ్చాల్సి వస్తుంది. జయలలిత కేసు రేపు అత్యున్నత న్యాయ స్థానం తలుపు తట్టవచ్చు గాక.... కానీ రాజకీయ ప్రేరే పిత కేసులలో దర్యాప్తు సంస్థలు, దిగువ న్యాయ స్థానాలు ఎంత జాగరూకతతో వ్యవహరించాలో తెలుసు కునేందుకు మాత్రం ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ.

- పోతుకూరు శ్రీనివాసరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement