గోదావరి మహా పుష్కరాల తొలిరోజే రాజమండ్రి లో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధ్యు లెవరైనప్పటికీ ఇది మానవ వైఫల్యానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్స వాలెంత సుప్రసిద్ధమైనవో, సమూహ నిర్వ హణ వైఫల్యాలూ అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టు కుంటూ కూచోవాల్సిన దుస్థితి, క్షంతవ్యం గాని వైఫల్యాల నుంచి సైతం ఏమీ నేర్చుకో లేని ఉదాసీనత మన సంస్కృతిలో భాగంగా మారాయి. గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపించింది. భారీగా నిధులనూ కేటాయించింది. సకల సౌకర్యాలూ, ఏర్పాట్లూ సమకూరుస్తున్నట్టే భరోసా కల్పించింది. ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా మన్నారు. విస్తృత ప్రచారంతో ప్రజలను ఆహ్వానిం చారు. ఏం లాభం? సమూహ నిర్వహణకు వచ్చేస రికి ఆదిలోనే ఘోర వైఫల్యం, మహా విషాదం ఎదుర య్యాయి. రాజమండ్రికి ఈ స్థాయిలో ప్రజలు తరలి వస్తారనేది ఊహించనిది కాదు.
వందల మంది చేరి తేనే తొక్కిసలాట, ప్రాణ నష్టం మనకు కొత్త కాదు. అలాంటప్పుడు లక్షల మంది గుమిగూడే సందర్భా నికి తగిన సన్నాహాలు, సంసిద్ధత ఏ స్థాయిలో ఉం డాలి? పుష్కర ఘాట్‌ల ప్రవేశ, నిర్గమన మార్గా ల్లో జనాల నియంత్రణకు తగిన ఏర్పాట్లు, మార్గనిర్దేశన ఉన్న దాఖలాలే లేవు. పైగా గం టల తరబడి తొక్కిసలాటలో నిలచిన భక్తులకు మంచినీటి వసతైనా కల్పించలేని అసమర్థతను ఏమనాలి? ఇంతటి ఘోర విషాదం తర్వాతైనా ప్రభు త్వం, అధికారయంత్రాంగం పాఠాలు నేర్చి మిగతా 11 రోజులైనా పుష్కరాలు సజావుగా సాగేలా సరైన చర్యలు చేపట్టాలి. భక్తుల ప్రాణాలు గాలిలో దీపా లుగా మారకూడదనుకుంటే ప్రభుత్వం తక్షణమే విప త్తు నిర్వహణ యంత్రాంగం సేవల్ని వినియోగించు కుని తగు చర్యలను చేపట్టాలి.
- డా॥డి.వి.జి. శంకరరావు
మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా
మహా పుష్కరం.. మహా విషాదం
Published Wed, Jul 15 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement
Advertisement