అదిగో అమరావతి | Shivarama krishnan committee warns not to construction the Amaravathi Capital of AP | Sakshi
Sakshi News home page

అదిగో అమరావతి

Published Sun, Sep 27 2015 12:50 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

అదిగో అమరావతి - Sakshi

అదిగో అమరావతి

గుంటూరు, కృష్ణాజిల్లాల మధ్య సారవంతమైన భూములలో రాజధాని నిర్మాణం వద్దనీ, లోతట్టు ప్రాంతం కనుక వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురికావడం ఖాయమనీ శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. అన్నీ ఒకేచోట ఉంటే హైదరాబాద్‌లో ఎదురైన అనుభవం అని వార్యమనీ, ఇతర ప్రాంతాలలో అసంతృప్తి రగులుతుందనీ చెప్పింది. హైదరాబాద్ బాబు లాంటి నగరం నిర్మించుకుందాం అంటూ చెబుతున్న చంద్రబాబు నాయుడు చైనాలో ఉన్నట్టు అరవై అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మించాలని సన్నిహితులతో అన్నారని భోగట్టా. మళ్లీ ఎన్నికల నాటికి ఓటర్లకు చూపించడానికి కళ్లు చెదిరే కట్టడం ఒకటైనా కావాలి. అందుకే అంత తొందర.
 
‘మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఇంజనీర్లు ఎంతోమంది ఉంటే మీరు మాట మాటకీ సింగపూర్ అంటున్నారు ఎందుకు సార్?’. ప్రఖ్యాత ఇంజనీరు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో ఒక విద్యార్థి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సూటిగా అడిగిన ప్రశ్న ఇది. ‘డిజైన్ మాత్రమే మలేసియా ఇస్తుంది, నిర్మాణం మనవాళ్లే చేస్తారు’ అంటూ ముఖ్యమంత్రి సమాధానం చెప్పి దాటవేశారు. అంతలోనే, సింగపూర్‌కి దీటుగా రాజధాని నిర్మించబోతున్నామనీ, అమరావతి మెగాసిటీకి అక్టోబర్ 22న విజ యదశమి రోజున ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయబోతున్నారనీ శుక్ర వారంనాడు చంద్రబాబునాయుడు శుభవార్త వెల్లడించారు.
 
 ‘నాకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అడిగిన వెంటనే సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అందజేసింది’ అని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో నాలుగో విడత సింగపూర్ సందర్శించి వచ్చి, ఢిల్లీలో మంత్రులను కలుసుకొని విన్నపాలు చేసుకొని తిరిగి వచ్చిన అనంతరం మరో నిర్ణయం ప్రకటించారు. మాస్టర్ డెవలపర్స్‌గా సింగపూర్ కంపెనీలే ఉండబోతున్నాయని తనదైన ధోరణిలో జంకూగొంకూ లేకుండా చెప్పారు.
 
అమరావతి నగర నిర్మాణానికి ప్రపంచ దేశాలన్నీ ఉత్సాహం చూపుతున్నా యనీ, చైనా, జపాన్, సింగపూర్‌లలో ఏ దేశం ప్రతిపాదన అనుకూలంగా ఉంటే (బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ప్రైస్) దానిని ఆమోదిస్తామనీ మొన్నటి వరకూ చెబుతూ వచ్చారు. గురువారంనాడు రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టు కనిపించారు. ‘మాస్టర్ డెవలపర్ ఎవరు?’ అంటే, ‘ఇంకా బిడ్స్ పిలవనే లేదు కదా, టైం పడుతుంది’ అంటూ సమాధానం చెప్పా రు తాపీగా. మర్నాడే ముఖ్యమంత్రి అంతా సింగపూర్‌కే స్విస్ చాలెంజ్ పద్ధతిలో అప్పగిస్తున్నామంటూ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. స్విస్ చాలెంజ్ పద్ధతి అంటే ఏమిటి? ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడుకొని వారిచ్చే ప్రతిపాదనకు ఒప్పుకొని కాంట్రాక్ట్ ఇవ్వజూపడం.
 
 అనంతరం ఇతర సంస్థలను కూడా ఆహ్వానించి అంత కంటే మంచి ప్రతిపాదన ఇవ్వమని అడగడం లేదా మొదటి ప్రతిపాదనలో మార్పులు సూచించమని చెప్పడం. ఇతర సంస్థలు సూచించిన మంచి మార్పు లను అమలు చేయడానికి అంగీకరిస్తే మొదటి సంస్థకే ఆ కాంట్రాక్టు అప్పగి స్తారు. ఇతర సంస్థలు ప్రతిపాదించిన మార్పులను అమలుచేయడం సాధ్యం కాదని మొదటి సంస్థ చేతులెత్తేస్తే ఆ కాంట్రాక్టును వేరే సంస్థకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్ తయారుచేసిన వారికి దానిలోని మతలబు తెలుస్తుం ది కనుక సహజంగానే మాస్టర్ డెవలపర్‌గా తెలివైన ప్రతిపాదనలతోనే ముందు కొచ్చే అవకాశముంది. స్విస్ చాలెంజ్ పద్ధతి మన దేశంలో గుజరాత్, పంజాబ్ వంటి అరడజను రాష్ట్రాలలో అమలు జరుగుతోంది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వవచ్చునంటూ సుప్రీంకోర్టు 2009లో తీర్పుచెప్పింది. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత తక్కువ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్- పీపీపీ- పద్ధతిలో జరిగే పనులకే ఈ విధానం కొంతవరకు అనుకూలం. అక్కడ కూడా ప్రైవేటు సంస్థ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వ్యయం ఎక్కువ అవుతోందని చెప్పినా కాంట్రాక్టు కొనసాగిం చలేకా, బయటపడలేకా సతమతం కావలసివస్తుంది. దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా వంటి దేశాలలో ఈ పద్ధతి చేదు అనుభవం మిగిల్చింది.
 
 మహారాష్ట్రలో సైతం అనిల్ అంబానీ ఆధ్వ ర్యంలోని ముంబై మెట్రో కంపెనీ టికెట్ చార్జీలను మూడురెట్లు పెంచాలంటూ పట్టుపట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సందిగ్ధంలో పడ్డా రు. మెట్రోరైల్ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మేలుకదా అని ఆలో చించారు. అమరావతి విషయంలో అటువంటి చిక్కులు ఎదురైనా చంద్రబాబు నాయుడికి సింగపూర్‌లో ఉన్న పరిచయాలతో వాటిని పరిష్కరించుకోగలుగు తారేమో. ఇటీవల దేశంలోని 400 రైల్వేస్టేషన్ల అభివృద్ధి కాంట్రాక్టును స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఖరారు చేసినట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడిం చారు. ఈ పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే ఒక గట్టి నియంత్రణ వ్యవస్థ ఉం డటం అత్యవసరమనే నిర్ణయానికి ప్రపంచ నిపుణులు వచ్చారు.
 
 నలుగురే కీలకం
 అమరావతి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యక్ష ప్రమేయం ఉన్న వారు నలుగురే నలుగురు. చంద్రబాబునాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ- కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) ప్రధాన నిర్వాహకుడు, ఐఏఎస్ అధికారి శ్రీకాం త్‌కి దాదాపు అన్నీ తెలుసు. మరో అధికారి అజయ్‌జైన్‌కు కొన్ని తెలుసు. స్విస్ చాలెంజ్ కాంట్రాక్టు తీసుకున్న పెద్ద పీపీపీ ప్రాజెక్టులను యూపీఏ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిధిలోకి తీసుకొని వచ్చింది. అటు వంటి వ్యవస్థ ఏదీ ఏపీలో లేదు.
 
 ‘మీతో వ్యాపారం చేయిస్తాను. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాను’ అంటూ సీఆర్‌డీఏ ప్రాంతంలోని రైతుల భూములను పూలింగ్ పద్ధతిలో సమీకరించిన సందర్భంలో వారిని ఒప్పించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు నిజంగానే రైతులు కోటీశ్వరులు కానూ కావ చ్చునని అనిపిస్తున్నది. ఎట్లా? రైతుల దగ్గర నుంచి సమీకరించిన భూములను సింగపూర్ కంపెనీలకు ఇచ్చేస్తాం. ఆ కంపెనీలతో వ్యవహారం చేయడానికి మనం కూడా ప్రభుత్వం తరఫున కంపెనీలను నెలకొల్పుతాం. సింగపూర్ కంపె నీలు లాభాలు ఆర్జిస్తాయి. మన కంపెనీలకు సైతం లాభాలు వస్తాయి.
 
 భూములు ఐచ్ఛికంగా పూలింగ్ పద్ధతిలో ఇచ్చిన రైతులకు ప్రభుత్వ కంపెనీలు ఆర్జించిన లాభాలలో వాటా ఇస్తాం. ఎందుకో కానీ ఈ వ్యవహారం అంతా గజి బిజిగా అనిపించి ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు మర్యాదగా తప్పుకొని దూరంగా జరిగిపోయారు. పురపాలక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన సాంబశివరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వెళ్లిపోయారు. మరో ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చుకున్న అధికారి గిరిధర్ సింగ పూర్ మంత్రి ఈశ్వరన్ మాస్టర్‌ప్లాన్ తీసుకువచ్చిన సందర్భంలోనే తప్పుకు న్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్‌లో కార్యదర్శిగా తలదాచుకున్నారు.
 
 వ్యాపారవేత్తలపై విశ్వాసం
 ఒక మహానగరాన్ని నిర్మించడం తేలిక కాదు. ఇంతటి క్లిష్టమైన వ్యవహారం మామూలు ఐఏఎస్ అధికారులకు అర్థం కూడా కాదు. వ్యాపారదక్షత ఉన్న వారికే విషయం అంతుబడుతుంది. అందుకే ముఖ్యమంత్రి ప్రస్తుత పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వెలవన్‌ను హైదరాబాద్‌లో వదిలేసి వ్యాపార వేత్త, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను సింగపూర్ తీసుకువెళ్లారు. వ్యాపార వేత్తలపైన చంద్రబాబునాయుడికి ఉన్న విశ్వాసం అటువంటిది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ ఉండాలో ఎట్లా ఉండాలో సూచించేందుకు కె. శివరామ కృష్ణన్ నాయకత్వంలో నిపుణుల కమిటీని యూపీఏ ప్రభుత్వం నియమిం చింది. పదకొండు జిల్లాలలో తిరిగి సాకల్యంగా పరిశీలన చేసిన ఈ కమిటీలోని ఐదుగురు నిపుణులు నిరుడు ఆగస్టు 24వ తేదీన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదిక సమర్పించారు. అంతకు మునుపే చంద్రబాబునాయుడు తన దైన ఒక కమిటీని నియమించారు. ఇందులో రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, వణిక్ ప్రముఖులు శ్రీనిరాజు, జీవీ సంజయ్‌రెడ్డి, ప్రభా కరరావు, బొమ్మిడాల శ్రీనివాస్, గల్లా జయదేవ్ ఉన్నారు.
 
 శివరామకృష్ణన్ నివే దిక చదవకుండానే విజయవాడ, గుంటూరు మధ్య కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందంటూ మంత్రివర్గం నిర్ణయించింది. శివరామకృష్ణన్ కమిటీ ఏమేమి కూడదని సిఫార్సు చేసిందో సరిగ్గా ఆ పనులే చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అన్నీ ఒకే చోట ఉంటే హైదరాబాద్‌లో ఎదురైన అనుభవం అని వార్యమనీ, ఇతర ప్రాంతాలలో అసంతృప్తి రగులుతుందనీ చెప్పింది. గుం టూరు, కృష్ణా జిల్లాల మధ్య సారవంతమైన భూములలో రాజధాని నిర్మాణం వద్దనీ, లోతట్టు ప్రాంతం కనుక వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురి కావడం ఖాయమనీ శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. శివరామకృష్ణన్ మే నెలలో మరణించారు. లోతట్టులో ఉంది కనుకనే దాదాపు పదివేల ఎకరాల భూమి మట్టాన్ని రెండు మీటర్ల ఎత్తు పెంచాలని ప్రయత్నం. ఇందుకోసం రూ.1500 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
 
 సింగపూర్ సాహసం
ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మించడాన్ని స్వాగతించవలసిందే. సింగపూర్ ప్రభుత్వం సాహసాన్ని సైతం అభినందించాలి. నిజంగానే సింగపూర్ ప్రభు త్వం, అక్కడి ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ చొరవ తీసుకొని సింగపూర్‌లోని ఇన్‌ఫ్రా కార్పొరేషన్లతో అమరావతిని నిర్మించి ఇస్తానంటూ పూచీ పడితే చిన్న దేశం పెద్ద భారాన్నే నెత్తికెత్తుకున్నట్టు లెక్క. సింగపూర్ నగరరాజ్యం విస్తీర్ణం 716 చదరపు కిలోమీటర్లు. సింగపూర్ నిర్మించబోయే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విస్తీర్ణం 8,360 చదరపు కిలోమీటర్లు, అంటే పది రెట్ల కంటే అధికం. ఇంకో సమస్య కూడా ఉంది. సింగపూర్ అవినీతికి దూరంగా ఉండే దేశాల జాబి తాలో ఏడవ స్థానంలో ఉంది.
 
మనది 85వ స్థానం. మాస్టర్ ప్లాన్ సింగపూర్‌దే అయినా, మాస్టర్ డెవలపర్ అక్కడి వారే అయినా స్థానిక కాంట్రాక్టర్లపైన ఆధారపడక తప్పదు. స్థానిక కాంట్రాక్టర్ల గురించీ, వారికి ప్రభుత్వంలోని పెద్ద లతో ఉండే సంబంధాల గురించీ, వారి పనితీరు గురించీ చెప్పనక్కర లేదు. ఇటీ వల నిర్మించిన పోలవరం కుడి కాలువ గట్టు ఎంత తేలికగా తెగిపోయిందో చూశాం. సింగపూర్ ప్రభుత్వం సిఫార్సు చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లు లాభా లు దండిగానే దండుకుంటాయి. అందుకే ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో ‘వారు గుజరాతీ బనియాలకంటే ఎక్కువ లాభాపేక్ష కలిగినవారు. జాగ్రత్తగా ఉండండి’ అంటూ చంద్రబాబు నాయుడికి హితవు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
 
హైదరాబాద్ బాబు లాంటి నగరం నిర్మించుకుందాం అంటూ చెబుతున్న చంద్రబాబు నాయుడు చైనాలో ఉన్నట్టు అరవై అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మించాలని సన్నిహితులతో అన్నారని భోగట్టా. మళ్లీ ఎన్నికల నాటికి ఓటర్లకు చూపించడానికి కళ్లు చెదిరే కట్టడం ఒకటైనా కావాలి. అందుకే అంత తొందర. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఎదుట కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను సత్వరం గెలిపించుకోవడానికి రాజధాని ప్రాంతంలో అన్నీ మెట్ట భూములేనని 1908 నాటి రెవెన్యూ రికార్డులలో ఉన్నదంటూ సీఆర్‌డీఏ కమి షనర్ నివేదించారు.

ప్రతిపక్షంలో ఉన్నంత కాలం చంద్రబాబునాయుడు విద్యుత్ రంగంలో తాను సంస్కరణలు ప్రవేశపెట్టి తప్పుచేశాననే అపరాధ భావనతో కనిపించే వారు. రైతులకు అన్యాయం చేశాననీ, మరోసారి అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం గురించి పట్టించుకుంటాననీ చెప్పేవారు. పాదయాత్ర సైతం చేశారు. విద్యుత్ సంస్కరణలు మొట్టమొదట ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి తానేనంటూ ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి రాజధాని కోసం భూ ములు త్యాగం చేసిన రైతులు కోటీశ్వరులు కాకపోతే వారు చంద్రబాబు నాయు డి భరతం పడతారు. నిజంగా కోటీశ్వరులైతే బ్రహ్మరథం పడతారు.
- కె.రామచంద్రమూర్తి
సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement