సాక్షి, హైదరాబాద్ : టీడీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ గుడ్‌బై చెప్పనున్నారు. నేడు ఢిల్లీలో ఆయన రామ్‌మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తతం ఏపీ ఫిల్మ్, థియేటర్, టెలివిజన్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్న అంబికా కృష్ణ.. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మార్పుతో పశ్చిమ టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment