సాక్షి,ఆదిలాబాద్: రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. బుధవారంతో ప్రచారం ముగిసింది. ఐదు మండలాలైన తలమడుగు, బజార్‌హత్నూర్, నేరడిగొండ, బోథ్, గుడిహత్నూర్‌లలో ఈ ఎన్నికలు ఈనెల 10న నిర్వహించనున్నారు. చివరి రోజు ప్రచారంలో ఆయా మండలాల్లో ముఖ్య నేతలు పాల్గొన్నారు. రెండో విడత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో లుకలుకలు బయట పడుతున్నాయి. ప్రచారం ముగియడంతో ఇక డబ్బు, మద్యం పంపిణీపై ఆయా పార్టీలు దృష్టి సారించాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ఈ ఐదు మండలాల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ త్రిముఖ పోరే కనిపిస్తోంది. జెడ్పీటీసీ అభ్యర్థులుగా తలమడుగు (జనరల్)లో టీఆర్‌ఎస్ నుంచి మేకల సదాశివ్, కాంగ్రెస్ అభ్యర్థిగా గోక గణేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చామపెల్లి సంతోష్, సీపీఐ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బజార్‌హత్నూర్(జనరల్)లో టీఆర్‌ఎస్ నుంచి నానం రమణయ్య, కాంగ్రెస్ నుంచి మల్లెపూల నర్సయ్య, బీజేపీ నుంచి డాక్టర్ బాలాజీ, స్వతంత్ర అభ్యర్థులుగా మెస్రం జంగుబాయి, ఎడ్ల లింగన్నలు బరిలో ఉన్నారు. నేరడిగొండ(ఎస్టీ జనరల్)లో టీఆర్‌ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుంచి ఆడె రాంచందర్, బీజేపీ నుంచి తొడసం శంకర్, టీడీపీ నుంచి ఆత్రం జ్ఞానసుధ పోటీ చేస్తున్నారు. బోథ్ (జనరల్ మహిళ)లో టీఆర్‌ఎస్ నుంచి రాజనాల సంధ్యారాణి, కాంగ్రెస్ నుంచి చాబంతుల శ్వేత, బీజేపీ నుంచి ఆకుల అనిత, స్వతంత్ర అభ్యర్థిగా లాడెవార్ కల్పనలు పోటీ చేస్తున్నారు. గుడిహత్నూర్ (జనరల్)లో టీఆర్‌ఎస్ నుంచి తరాడ్ బ్రహ్మానంద్, కాంగ్రెస్ నుంచి బాలాజీ సోన్‌టక్కే, బీజేపీ నుంచి పతంగే బ్రహ్మానంద్, టీడీపీ నుంచి పి.మహేందర్, స్వతం త్ర అభ్యర్థులు జుగ్నాక హన్మంతు, సర్పే గంగాధర్‌లు పోటీ చేస్తున్నారు.
ప్రచారంలో ముఖ్య నేతలు..
నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయా మండలాల్లో ప్రచారం ప్రారంభమైంది. నేరడిగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్ని గ్రామాల్లో పర్యటించారు. ఎంపీ నగేష్ ఈ మండలంలో పర్యటిం చి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ నుంచి సోయం బాపురావు, చిట్యాల సు హాసిని రెడ్డిలు ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. గుడిహత్నూర్‌లో బీజేపీ నుంచి బాపురావు తప్పా మరెవరు ముఖ్య నేతలు ప్రచారానికి రాలేదు. తలమడుగులో టీఆర్‌ఎస్‌లో లుకలుకలు కనిపించాయి. బుధవారం ప్రచారం చివరి రోజు ఎంపీ నగేష్, ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగురామన్న, రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డిలు ప్రచారం నిర్వహించారు. అ యితే ఈ ప్రచారానికి సంబంధించి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సమాచారం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మొదట టీఆర్‌ఎస్ నుంచి లోక భూమారెడ్డి బంధువు కేదరేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన అనుచరుడైన మేకల సదాశివ్‌కు టిక్కెట్ ఇవ్వడంతో కేదరేశ్వర్‌రెడ్డికి అవకాశం దక్కలేదు. ఈ వ్యవహారంతో ముఖ్య నేతల మధ్య విభేదాలు ఉన్నాయనేది ప్రస్పుటమైంది. తాజాగా ప్ర చారంలో ఎమ్మెల్యే లేకుండానే నిర్వహించడం ప్రా« దాన్య త సంతరించుకుంది. బోథ్‌లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బీజేపీ నుంచి బాపురావు, సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నుం చి రాముల్‌నాయక్‌లు ప్రచారం నిర్వహించారు. బజార్‌హత్నూర్ మండలంలో టీఆర్‌ఎస్ నుం చి ఎంపీ నగేష్, బీజేపీ నుంచి బాపురావులు ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ నుంచి ము ఖ్య నేతలెవరు ఈ మండలంలో పర్యటించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment