ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. | YS Jagan Prajasankalpa yatra 147 day resumes at nandamuru cross road | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 9:28 AM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

YS Jagan Prajasankalpa yatra 147 day resumes at nandamuru cross road - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రజా సమస్యలు తెలుసుకొని.. వారితో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 147వ రోజు నందమూర్‌ క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర శనివారం నందమూరు క్రాస్‌రోడ్డు నుంచి మొదలై.. రాజుపేట, కాటూరు, కడవకొల్లు మీదుగా ఉయ్యూరు వరకు సాగనుంది. సాయంత్రం ఉయ్యూరులో వైఎస్‌ జగన్‌ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

అడుగడుగునా ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారి కష్టాలు ఉంటూ.. అండగా నేనున్నానని భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ప్రతిచోట జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఊరులోనూ వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement