‘అవినీతి బయటకొస్తుందనే బస్సు యాత్ర’ | YSRCP MLA Hafeez Khan Blames Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘అవినీతి బయటకొస్తుందనే బస్సు యాత్ర’

Published Sun, Jan 12 2020 12:17 PM | Last Updated on Sun, Jan 12 2020 1:13 PM

YSRCP MLA Hafeez Khan Blames Chandrababu Naidu - Sakshi

కర్నూలు:  అమరావతి రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. ఇప్పుడు ఆ అవినీతి బయటకొస్తుందనే భయంతోనే బస్సు యాత్ర డ్రామాకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అమరావతి భూముల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ భయంతోనే చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు.  ఇప్పటికే తెలంగాణలో టీడీపీ క్లోజ్‌ అయ్యిందని, ఇక ఏపీలో కూడా క్లోజ్‌ ఖావడం ఖాయమన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీనిని అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ బురద జల్లుతుందన్నారు.

‘మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి. చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాంతాన్ని వివక్షకు గురి చేశారు. అమరావతి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. మరోసారి రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారు. అమరావతి భూములను చంద్రబాబు, టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి అవినీతికి పాల్పడ్డారు. ఇది బయటకు వస్తుందనే చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు రాయలసీమలో అడుగుపెట్టే హక్కును కోల్పోయారు. కర్నూలుకు రావాల్సిన రాజధానిని చంద్రబాబు అమరావతికి తరలించారు. 9 ఏళ్లు హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకరణ చేసి తప్పు చేశారు. అదే తప్పును అమరావతిలోనూ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీనికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement