సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అన్వర్ ఉలూమ్ కాలేజీకి చెందిన అజహర్ అలీఖాన్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో సిటీ కాలేజీకి చెందిన అబుబాకర్‌పై అజహర్ విజయం సాధించాడు. కె. విశ్వతేజ (వెస్లీ డిగ్రీ కాలేజి), సయ్యద్ జబ్బార్ అహ్మద్ (లార్డ్స్ కాలేజి) ఉమ్మడిగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ 72 కేజీల కేటగిరీలో కె. శివ (నిజాం కాలేజి), అబ్దుల్ కరీర్ (అన్వర్ ఉలూమ్) వరుసగా రెండు స్థానాలను సాధించగా... జె. సందీప్ యాదవ్ (ప్రగతి కాలేజి), అక్షత్ కుమార్ (క్వీన్ మేరీ కాలేజి) సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచారు. ఈ పోటీలను ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా ప్రారంభించారు.
ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు
∙గ్రీకో రోమన్: 55 కేజీలు: 1. సయీద్ (బద్రుక), 2. రాజేశ్ (జీసీపీఈ, దోమలగూడ), 3. మనీశ్ (ప్రగతి), హరిశేత్ (జాహ్నవి).
∙60 కేజీలు: 1. దిగంబర్ హజారే (ఎస్డీ సిగ్నోడియా కాలేజి), 2. మనోజ్ (ఏవీ కాలేజి), 3. శ్రీకాంత్ (అంబేడ్కర్ కాలేజి), విశాల్ (బద్రుక).
∙63 కేజీలు: 1. రామ్ కుమార్ (భవన్స్), 2. ఫర్దీన్ (విద్యాదాయని), 3. అంకిత్ (అరోరా), సయ్యద్ మొయినుద్దీన్ (అన్వర్ ఉలూమ్).
∙67 కేజీలు: 1. శశినాథ్ (నృపతుంగ), 2. మనీశ్ (అవినాశ్ కాలేజి), 3. మహేశ్ (సెయిం ట్ పాయ్స్), మొయినుద్దీన్ (అన్వర్ ఉలూమ్).
∙ఫ్రీస్టయిల్: 57 కేజీలు: 1. ఉస్మాన్ ఖాన్ (షాదన్ కాలేజి), 2. మహేందర్ (ప్రగతి కాలేజి), 3. సాయి నిశాంత్ (జాగృతి), అబ్రాబిన్ హుస్సేన్ (పుల్లారెడ్డి).
∙61 కేజీలు: 1. పవన్ కల్యాణ్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజి), 2. అబ్దుల్ వాసెద్ అసుబకర్ (అల్ ఖర్మోషి కాలేజి), 3. ఫహాద్ బిన్ సయీద్ (ప్రెసిడెన్సీ), జయంత్ (అవినాశ్ కాలేజి).
∙65 కేజీలు: 1. సయ్యద్ అబ్దుల్ అర్షద్ (లార్డ్స్ కాలేజి), 2. నూరుద్దీన్ (హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్), 3. ముజఫర్ (అన్వర్ ఉలూమ్), చంద్రశేఖర్ (అవినాశ్ కాలేజి).
∙70 కేజీలు: 1. రోహిత్ సింగ్ (నవ చైతన్య డిగ్రీ కాలేజి), 2. సయ్యద్ అబ్రార్ (ప్రెసిడెన్సీ కాలేజి), 3. సాయిదత్తా (సెయింట్ ప్యాట్రిక్), కార్తీక్ (ప్రగతి కాలేజి).
Comments
Please login to add a commentAdd a comment