బ్రెజిల్ కాస్ట్‌లీ గురూ!
రియో డి జనీరో: సాకర్ ప్రపంచకప్ మ్యాచ్‌ల్ని చూసేందుకు బ్రెజిల్‌కు వెళ్తున్నారా ? ఫ్యామిలీతో కలిసి సాకర్ మజాను ఆస్వాదించాలనుకుంటున్నారా ? అయితే ఓ సారి మీ బ్యాంక్ అకౌంట్‌లో లక్షల్లో బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే ప్రపంచకప్ సందర్భంగా బ్రెజిల్‌లో హోటళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అద్దె రోజుకు సుమారు రూ. 30వేలు వసూలు చేస్తున్నారు. తిండికి, ప్రయాణాలకు, జల్సాలకు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. చీజ్ బర్గర్‌కు రూ. 1000, పెప్పెరోని పిజ్జాకు రూ. 2000 చెల్లిం చాల్సిందే. ఇక షాపింగ్‌లకు వెళితే పర్సులు ఖాళీ అవడం గ్యారెంటీ.
అమెరికా, యూరోప్‌లో దొరికే వస్తువులు ఇక్కడ కొంటే మూడు రెట్లు అధికంగా చెల్సించాల్సిన పరిస్థితి. డబ్బులు ఖర్చయినా నాణ్యమైనవి దొరుకుతున్నాయా అంటే అదీ కూడా లేదు. ఇందుకు కారణం 2009 నుంచి 2012 వరకు బ్రెజిల్‌లో వార్షిక ఆదాయం 40 శాతం పెరిగింది. దీంతో అక్కడి జనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ఆ దేశంలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేదు. బయటి దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ప్రపంచకప్ కారణంగా వీటికి మరింతగా డిమాండ్ పెరిగింది.