సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోవడానికి అడుగుదూరంలో నిలిచిన తమ జట్టు అభిమానుల నమ్మకాన్ని గెలవాల్సిన సమయం ఆసన్నమైందని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో పేర్కొన‍్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్.. రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఇంకా మూడు టెస్టుల మాత్రమే మిగిలి ఉండటంతో గురువారం పెర్త్‌లో ఆరంభం కానున్న మూడో టెస్టులో విజయం గెలుపు ఇంగ్లండ్‌కు అనివార్యం. దానిలో భాగంగా బ్రిటీష మీడియాతో మాట్లాడిన బెయిర్ స్టో.. కీలకమైన మూడో టెస్టులో గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నాడు.
' ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల ఓడిపోయి కష్టాల్లో పడ్డాం. ఇవన్నీ ఆటలో భాగమే..కానీ అభిమానుల నమ్మకాన్ని గెలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మిగతా టెస్టుల్లో గెలిచి గాడిలో పడాల్సిన అవసరముంది. గురువారం నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టులో గెలుపు బాట పడతామని ఆశిస్తున్నా. జట్టులోని సభ్యులంతా సమష్టిగా రాణించి విజయానికి నాంది పలకాలి. విజయాలు సాధిస్తేనే అభిమానుల మనుసు గెలవడం సాధ్యమవుతుంది' అని బెయిర్ స్టో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment