న్యూఢిల్లీ: సాకర్ ప్రపంచకప్ దగ్గరపడుతోంది. అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో వివిధ దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్ల గురించి ఇంటర్‌నెట్‌లో సెర్చింగ్‌లూ పెరిగిపోయాయి. అయితే ఇలా సెర్చ్ చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతారని మెకాఫీ అనే యాంటీ వైరస్ సంస్థ హెచ్చరిస్తోంది.
కొందరు ఆటగాళ్లకు చెందిన వెబ్ పేజీలను సెర్చ్ చేస్తే మెయిల్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశముందని పేర్కొంది. వీరిలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేజీని తెరవడం అత్యంత రిస్క్‌తో కూడుకున్నదని తెలిపింది. రొనాల్డో తరువాత ప్రమాదం పొంచి ఉన్న లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), ఐకర్ కాసిల్లాస్ (స్పెయిన్), నేమర్ (బ్రెజిల్), కరీమ్ జియానీ (అల్జీరియా) వంటి 11 మంది ఆటగాళ్ల పేర్లుతో కూడిన జాబితాను విడుదల చేసింది. కాబట్టి అభిమానులూ.. తస్మాత్ జాగ్రత్త!
అభిమానులూ.. ‘సెర్చ్’లో జాగ్రత్త!
Published Thu, Jun 5 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement