తొలి రోజు నాలుగు పతకాలు | Four medals for first | Sakshi
Sakshi News home page

తొలి రోజు నాలుగు పతకాలు

Published Thu, Nov 27 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

Four medals for first

విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్లు బోణీ చేశారు. స్వర్ణం, రజతంతో పాటు రెండు కాంస్య పతకాలు సాధించారు. అండర్-14 బాలికల హైజంప్‌లో కేరళకు చెందిన గాయత్రి శివకుమార్ 1.61 మీటర్లు ఎత్తు ఎగిరి; అండర్-16 బాలుర 1000 మీటర్లలో హరియాణాకు చెందిన బియాంత్ సింగ్ (2ని:27:8సెకన్లు) కొత్త జాతీయ రికార్డులు నెలకొల్పారు.

అండర్-14 బాలుర ట్రయాథ్లాన్‌లో కడప స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన పి.వివేకానంద రెడ్డి స్వర్ణ పతకం సాధించగా... ఎ. కోటేశ్వరావు (ఏపీ) 1766 పాయింట్లు) కాంస్యం నెగ్గాడు. అండర్ -14 లాంగ్‌జంప్‌లో ఎ.కోటేశ్వరరావు (ఏపీ-5.94 మీటర్లు), పి.పాండు నాయక్ (తెలంగాణ-5.91 మీటర్లు) రజత, కాంస్య పతకాలు సాధించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ జట్టు 25 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement