ఫైనల్లో వెస్టిండీస్ | In the final, West Indies | Sakshi
Sakshi News home page

ఫైనల్లో వెస్టిండీస్

Published Sun, Jun 26 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

ఫైనల్లో వెస్టిండీస్

ఫైనల్లో వెస్టిండీస్

ముక్కోణపు వన్డే టోర్నీ
ఆఖరి లీగ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం
►  డారెన్ బ్రేవో సెంచరీ

 
 
బ్రిడ్జిటౌన్: సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే టోర్నీలో వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ 100 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటిం గ్ చేసిన వెస్టిండీస్ 49.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటయింది. డారెన్ బ్రేవో (103 బంతుల్లో 102; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను... బ్రేవో, పొలార్డ్ (71 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌కు 156 పరుగులు జోడించి ఆదుకున్నారు.

హోల్డర్ (46 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), బ్రాత్‌వైట్ (42 బంతు ల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. రబడ, మోరిస్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా జట్టు 46 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటయింది. బెహర్డీన్ (57 బంతు ల్లో 35; 4 ఫోర్లు), మోర్కెల్ (47 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) మినహా ఎవరూ కుదురుగా ఆడలేదు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ (3/17), నరైన్ (3/28) రాణించారు. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement