భారత్‌కు నాలుగో స్థానం | India is fourth in the World Team Chess Championship | Sakshi
Sakshi News home page

భారత్‌కు నాలుగో స్థానం

Published Fri, Mar 15 2019 4:38 AM | Last Updated on Fri, Mar 15 2019 4:38 AM

India is fourth in the World Team Chess Championship - Sakshi

ఆస్తానా (కజకిస్థాన్): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న భారత్‌ నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. గురువారం రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత్‌ 1.5–2.5తో ఓడిపోయింది. ఈ గేమ్‌ను 2–2తో డ్రా చేసుకున్నా.... కనీసం భారత్‌కు కాంస్య పతకం లభించి ఉండేది. సెర్గీ కర్జాకిన్ తో ఆదిబన్ , దిమిత్రి ఆండ్రే కీన్  తో అరవింద్‌ చితాంబరమ్, ఇయాన్‌  నెపొనియాచితో సూర్య గంగూలీ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా... మూడో బోర్డుపై అలెగ్జాండర్‌ గ్రిస్చుక్‌ చేతిలో ఎస్పీ సేతురామన్‌ ఓడిపోయాడు.

దీంతో భారత్‌ 11 పాయింట్ల తో నాలుగో స్థానంలో నిలిచింది. 16 పాయింట్లతో రష్యా స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, 13 పాయింట్లతో ఇంగ్లండ్‌ రజతాన్ని, చైనా (12 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి. వ్యక్తిగత ప్రదర్శనలకుగాను ఆధిబన్‌ (6/9), సూర్య గంగూలీ (7/9) పసిడి పతకాలు గెలుచుకున్నారు. మహిళల విభాగంలో భారత్‌ 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో టోర్నీని ముగించింది. హంగేరీతో తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను భారత్‌ 2–2తో డ్రా చేసుకుంది. 

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement