న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటను ఈసారి కోల్‌కతాలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 19న ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తారు. చాన్నాళ్లుగా ఆటగాళ్ల వేలాన్ని బెంగళూరులోనే నిర్వహిస్తున్నా రు. ఈసారి కొత్తగా కోల్‌కతాకు మార్చారు. గతంలో ఎప్పుడు కూడా బెంగాల్ గడ్డపై వేలం పాటను నిర్వహించలేదు. దీంతో ఇప్పటి నుంచే ఆటగాళ్ల విడుదల, పరస్పర బదిలీలకు నవంబర్ 14వ తేదీ వరకు అనుమతిస్తారు. 2019 సీజన్‌లో ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు గరిష్టంగా రూ. 82 కోట్లు వెచ్చించేందుకు అనుమతించగా... 2020 సీజన్‌లో రూ. 85 కోట్లకు పెంచారు. అత్యధికంగా ఢిల్లీ వద్ద రూ.8.2 కోట్లు మిగిలున్నాయి. రాజస్తాన్ ఖాతాలో రూ. 7.15 కోట్లు, కోల్‌కతా ఖాతాలో రూ.6.05 కోట్లు, హైదరాబాద్ ఖాతాలో రూ.5.30 కోట్లు మిగిలి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment