బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌లు వెళ్లిపోతున్నారు..! | Jos Buttler, Ben Stokes to return home after KKR clash | Sakshi
Sakshi News home page

బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌లు వెళ్లిపోతున్నారు..!

Published Thu, May 17 2018 5:37 PM | Last Updated on Thu, May 17 2018 5:39 PM

Jos Buttler, Ben Stokes to return home after KKR clash - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్లే ఆఫ్‌  వేటలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ ను వదిలి ఆ జట్టు స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌, ఖరీదైన ఆటగాడు బెన్‌ స్టోక్స్‌లు స్వదేశానికి పయనం కానున్నారు.  ఆ ఇద్దరికీ ఈ నెల 24 నుంచి పాకిస్తాన్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో చోటు దక్కింది. ఈ మేరకు వీరిద్దరినీ వెంటనే జాతీయ జట్టుతో కలవాలంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఆదేశించింది. దీంతో ఇరువురూ ఉన్నపళంగా ఇంగ్లండ్‌కు పయనమయ్యారు.  ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన మ్యాచే వీరికి ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌.

రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే బెంగళూరుతో మ్యాచ్‌ కీలకం. ఈ దశలో స్టోక్స్‌, బట్లర్‌లు దూరమవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో భారీ ధర పలికిన బెన్‌ స్టోక్స్‌ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాడు. 196 పరుగులు చేసి 8 వికెట్లు తీయగా, బట్లర్‌ వరుస ఐదు హాఫ్‌ సెంచరీలతో 548 పరుగులు సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement