భారత కుర్రాళ్ల జోరు | Junior Hockey World Cup: India beat England 5-3, virtually in quarters | Sakshi
Sakshi News home page

భారత కుర్రాళ్ల జోరు

Published Sun, Dec 11 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

భారత కుర్రాళ్ల జోరు

భారత కుర్రాళ్ల జోరు

ఇంగ్లండ్‌పై 5–3తో విజయం
జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌

 
లక్నో: సొంతగడ్డపై భారత యువ జట్టు అదరగొట్టింది. జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–3 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

భారత్‌ తరఫున పర్విందర్‌ సింగ్‌ (24వ ని.లో), అర్మాన్‌ ఖురేషీ (35వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (37వ ని.లో), సిమ్రన్‌జిత్‌ సింగ్‌ (37వ ని.లో), వరుణ్‌ కుమార్‌ (59వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ఇంగ్లండ్‌ జట్టుకు జాక్‌ క్లీ (10వ ని.లో), విల్‌ కాల్‌నన్‌ (63వ ని.లో), ఎడ్వర్డ్‌ హోర్లర్‌ (67వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. సోమవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement