యాకుత్‌పురా: రాష్ట్ర క్రీడల సమాఖ్య, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సీనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ శుక్రవారం ప్రారంభమైంది. గౌలిపురాలోని ఆలె నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రారంభించారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆదివారం వరకు పోటీలు జరుగుతాయి.
ఇందులో రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవంలో బీజేపీ నగర ఉపాధ్యక్షులు చర్మాణి రూప్‌రాజ్, మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర, హైదరాబాద్ నెట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షులు సి.శ్రీధర్ చారి, కార్యదర్శి ఎం.విఘ్నేశ్వర్, కోశాధికారి ఎల్.శ్రీధర్ రావు, సభ్యులు వై.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment