పాక్‌దే టి20 సిరీస్
హరారే: జింబాబ్వేతో జరిగిన రెండు టి20ల మ్యాచ్ సిరీస్‌నుపాకిస్థాన్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన రెండో టి20లో పాక్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో పాక్ రికార్డు స్థాయిలో 13 సార్లు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను గెలుచుకున్నట్టయింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు (12) ఉంది. అహ్మద్ షెహజాద్ (64 బంతుల్లో 98 నాటౌట్; 6 ఫోర్లు; 6 సిక్స్‌లు) దుమ్ము రేపగా మహ్మద్ హఫీజ్ (40 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 2 సిక్స్‌లు) నిలకడగా రాణించాడు. వీరిద్దరి జోరుతో పాక్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగుల స్కోరు సాధించింది.
36 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా ఆ తర్వాత ఈ జోడి పూర్తి ఆధిక్యం చూపుతూ రెండో వికెట్‌కు 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని ఏర్పరిచింది. పాక్ తరఫున టి20ల్లో షెహజాద్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మసకద్జాకు వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేయగలిగింది. మసకద్జా (32 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) టాపర్‌గా నిలిచాడు. తొలి వికెట్‌కు 50 పరుగులు చేకూరినా స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. చివర్లో చిగుంబురా (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్) చెలరేగి జట్టు విజయం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. హఫీజ్‌కు మూడు, బాబర్‌కు రెండు వికెట్లు దక్కాయి.