విశాఖ: యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను టీమిండియా ఆటగాళ్లు ఘనంగా జరిపారు. శుక్రవారం పంత్ 22వ పుట్టినరోజు వేడుకల్ని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో నిర్వహించారు. పంత్ చేత కోహ్లి గ్యాంగ్ కేక్ కట్ చేయించి అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలోనే అతని ముఖానికి కేక్ పూసిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. ఇందుకు హ్యాపీ బర్త్‌డే రిషభ్‌పంత్ అంటూ పేర్కొంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో రిషభ్ పంత్ లేకపోయినప్పటికీ జట్టుతో పాటే ఉన్నాడు. దాంతో టీమిండియా ఆటగాళ్ల సమక్షంలోనే పంత్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
తొలి టెస్టుకు వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. పంత్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఇటీవల కాలంలో ఘోరంగా విఫలమవుతున్న పంత్‌ను తప్పించి మరో అత్యుత్తుమ టెస్టు వికెట్ కీపర్ సాహాకు అవకాశం కల్పించారు. గతేడాది సాహా గాయ పడటంతో టెస్టులకు సైతం పంత్‌నే ఎంపిక చేస్తూ వచ్చారు. కాగా, సాహా తేరుకోవడంతో టెస్టు జట్టుకు చాలా కాలం తర్వాత ఎంపికయ్యాడు. ఇక పంత్ పేలవమైన ప్రదర్శన కారణంగా స్థానం కోల్పోయాడు. భారత జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్‌గా స్థానం సంపాదించే క‍్రమంలో అతని నిరాశజనక ప్రదర్శనతో రేసులో వెనుకబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment