న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లను ప్రొఫెషనల్‌గా నడిపించేందుకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నడుం బిగిస్తోంది. ఈ మేరకు సమాఖ్యలకు సీఈఓలను నియమించాలని భావిస్తోంది.
కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘సాయ్’ మౌలిక వసతులను ఉపయోగించుకుని మాజీ ఆటగాళ్లు శిక్షణ ఇవ్వడానికి ముందుకొస్తే వారి భాగస్వామ్యంతో (ఆదాయం పంచుకునే పద్ధతి) ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గిరిజన, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య మారుమూల, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సాహించాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రాంత క్రీడల (ఎస్‌ఏజీ) కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
క్రీడా సమాఖ్యలకు సీఈఓలు
Published Thu, Dec 19 2013 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement