ఇస్లామాబాద్: నిన్న, మొన్నటి వరకూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అంతా నడుంబిగించాలని వరుసగా వీడియోలు పెట్టిన పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్ అక్తర్ లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. ప్రజలంతా ఇంట్లో కూర్చొన్న వేళ రోడ్లపైకి వెళ్లి షికార్ చేశాడు. జనం ఎవరూ లేకపోవడంతో ఇస్లామాబాద్‌లోని రోడ్లపై సైకిల్‌తో చక్కర్లు కొట్లాడు. దీనిని వెనకాలే ఫోలో అయిన అతని స్నేహితుడు వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు అక్తర్. ‘నా బ్యూటీఫుల్ ఇస్లామాబాద్ సిటీలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నా. జన సంచారం లేని రోడ్లపై ఇది నా బెస్ట్ వర్కౌట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.('ధోనీ అప్పుడే రిటైర్ అయితే బాగుండేది')
దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు అక్తర్.ఏదో సరదా పడి ఇలా సైక్లింగ్ చేస్తే ఇదేమీ తలపోటురా అనుకునేంతగా విమర్శల పాలయ్యాడు. ‘ అక్తర్.. ఇది నువ్వు సైక్లింగ్ చేయడానికి సరైన సమయం కాదు. నువ్వు కూడా చాలా మంది తరహాలో నిబంధనల్ని అతిక్రమించావ్. స్టేహోమ్.. స్టే హెల్తీ సూత్రాన్ని పక్కన పెట్టేశావ్’ అని ఒకరు విమర్శించగా, ‘ నువ్వు చాలా సెల్ఫిష్ అక్తర్.. జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్. ‘ సెలబ్రెటీలు అనేవారు ఆదర్శవంతంగా ఉండాలి. వారే మాటల్ని ప్రజలు పాటిస్తారు.
మరి నువ్వు వారికి ఇచ్చే సందేశం ఏమిటి. కోవిడ్-19తో ప్రజలు ఇంటికే పరిమితమైతే నువ్వు ఇలా రైడ్లు చేస్తావా. ఒక రోల్ మోడల్‌గా ఉండాల్సిన నువ్వు.. ఈ అనవసరపు ఎంజాయ్‌మెంట్ ఏమిటి’ అని మరొకర కామెంట్ చేశారు. ‘ నువ్వా నా ఫేవరెట్ బౌలర్. ఇలా నిన్ను చూడటం బాధిస్తుంది. లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించి కరోనా కట్టడికి ఎలా సహకరిస్తున్నావ్’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘ ఇప్పుడు ప్రజలంతా నిన్ను గుడ్డిగా ఫాలో అయ్యి బయటకు వచ్చేస్తే పరిస్థితి ఏమిటి. వారంతా కరోనా బారిన పడాలని నీ యోచనా’ అని మరొకరు ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment